పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

287

40వ అధ్యాయము.

నేనంతట, వారిని గాఢముగా మందలించి "ఇట్లు పలుకుట ఎంత బుద్ధిహీనత! మీరా విగ్రహము ద్వారమున అర్చించుస్వామికి ఈ ఆభరణరాశియంతయు ఒకమట్టిగడ్డను మించిన విలువగలవికావు సుడీ! ఆదేవదేవునినుండియేగదా, లక్ష్మీదేవి సయితము తన వైబవమునంతను పడయునని జ్ఞప్తినుంచుకొనుడు!" అని చెప్పితిని.

823. ఎవడెంతగా ధనము నర్పించినను భగవంతుడు లెక్కసేయునా? ఎన్నడునులేదు! ప్రేమను భక్తిని ఎవడర్పించునో వానిపైని స్వామికి కృపగల్గును. స్వామి తననుగూర్చి చేయబడు ప్రేమను, భక్తిని, వివేకమును వైరాగ్యమును మాత్రమే గణనచేయును.

824. బ్రహ్మసాక్షాత్కారమునుగోరి, అనేకులుదీర్ఘకాలము నిష్ఠలను, జపములను, ధ్యానములను, తపములను, పూజలను సలిపిన పవిత్రస్థలములందు భగవంతుడు ప్రత్యక్షమైయుండునని యెఱుంగుము. వారి శ్రద్ధవలన ఆధ్యాత్మభావములు అక్కడ ఘనీభూతములైయుండు ననవచ్చును. అట్టిప్రదేశములందు పరమార్ధభావమునకు ప్రబోధముకలుగుటయు బ్రహ్మసాక్షాత్కారము లభించుటయు అందువలననే స్మృతిదాటి పోవుకాలమునుండియు అసంఖ్యాకులగు సాధువులు, భక్తులు బ్రహ్మవిదులు ఇట్టితీర్థములను దర్శించి సకలవాంఛలను మట్టుపెట్టి, భక్తావేశిత హృదయములతో బ్రహ్మపరోక్షాను భూతికొఱకై నిష్ఠలుసలిపియుందురు. కాబట్టి భగవంతుడు సర్వత్రనిండియున్నను ఈక్షేత్రములందు ప్రత్యేకముగ ప్రసన్ను