పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

286

వానివలె పడుకొనియెయుండును. చుఱుకుదనము కలవియో, అబ్బో; తమజోలికివచ్చినందుకై ఆగ్రహపడినటులలేచును. వ్యవసాయకులు ఈరకమువానినే కోరుకొందురు.

ఎవడేని ప్రయోజనపరుడై జీవించునెడల తనయందు నిజమగు పౌరుషమును తాల్చవలయును. కాని పౌరుషహీనులు చాలమందియుందురు - పాలలోనానవేసిన మరమరాలవలె మెత్తనై అంటుకొనిపోవుచుందురు. వారిలోబలమే శూన్యము. నిలువబడి పనిచేయుసమర్థత యుండదు. సంకల్పశక్తి సున్న! అట్టివారిజీవనములు వ్యర్థములు.

821. శంభుమల్లికుగారు ఒకసారి "అయ్యా! నాసంపదనంతను దివ్యమాత పావన పాదపద్మములు చెంత అర్పణముచేసి మరణించునటుల నన్నాశీర్వదించుడు" అని కోరెను. నేనిట్లు చెప్పితిని:- "ఏమనుచుంటివి? అదంతయు నీవు గొప్పసంపదగా ఎంచుకొనవచ్చును; ఆదివ్యమాతకో పాదముల క్రింద నీవుత్రొక్కుచు నడుచుధూళికన్న ఏమియు అతిశయముగ చూపట్టదుసుమీ!"

822. ఒకసారి దక్షిణేశ్వరమునందలి రాచమణిరాణిగారి తోటలో దొంగతనముజరిగినది. విష్ణ్వాలయమందలి విగ్రహములకు ధరించిన ఆభరణములన్నియు పోయినవి. (రాణీగారి అల్లుడును దేవాలయధర్మకర్తయునగు) మధురనాధుగారును నేనును ఏమిజరుగునో చూడబోతిమి. మధురనాధుగారు "ఓ దేవుడా! నీవసమర్థుడవు. దొంగలు నీనగలనన్నిటిని దోచుకొనిపోయిరే! అడ్డుపడలేకపోతివి!" అనెను.