పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

288

డగుచుండును. ఎక్కడత్రవ్వినను నీరుదొఱకగలదు. కాని బావియో, కోనేరో, సరస్సోయున్నచోట త్రవ్వవలసిన పని లేకయే, కావలయునన్నప్పుడెల్ల సంసిద్ధముగ నీరుదొఱకును గదా!

825. ఆవులు పొట్టలనిండ గడ్డిమేసి, నెమ్మదిగ ఒకచోట పరుండి నెమరువేయును; అటులనే నీవొక పుణ్యతీర్థమును దర్శించినపిమ్మట, అక్కడ నీమనస్సునకుతట్టిన పవిత్ర సంకల్పములను శ్రద్ధగా కూడబెట్టుకొనియుంచి, ఒక ఏకాంతస్థలమునకూర్చుండి వానిలో నీవు నిమగ్నమై పోవువఱకును మననము చేయవలయును. ఆక్షేత్రమునుండి నీవు మరలగానె ఆసంకల్పములను నీమనస్సునుండి జారిపోనిచ్చి, యింద్రియభోగములందు పడిపొరాదు.

826. భూమినలుదిక్కులను ద్రిమ్మరినను అందునకేమియు (సత్యమగు మతము) చిక్కబోదు. ఉన్నదంతయు ఇక్కడనే (హృదయమందు) ఉన్నది.

827. అహంకారనాశమును ఎట్లు చేయవలయునో తెలియునా? వడ్లుదంచునప్పుడు, వారప్పుడప్పుడు ఆగి, ధాన్యము మెదిగెనో లేదో చూతురు. సన్నసరకును తూచునప్పుడు నడుమ నడుమ ఆగి, త్రాసుపుల్లసరిగా ఆడుచున్నదో లేదో అని త్రాసును సవరించుచుందురు. అటులనే నాలోనిఅహంభావము అణగిపోయినదో లేదో చూచుకొనుటకు, అప్పుడప్పుడు ఆత్మనిందచేసికొను చుండెడివాడను. ఒక్కొకప్పుడు నాశరీరమును పరిశీలించుకొనుచు ఇట్లుతలపోసెడివాడను.