పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

289

40వ అధ్యాయము.

ఈశరీరమునుచూడు. ఎముకలు మాంసముతోకూడిన పంజరముకాక ఇదేమిటి? ఇందులో నెత్తురు, చీము, ఇంక నిట్టి మలినపదార్థములుతప్ప యేమున్నవి? ఆహా! దీనినిగురించి మహాగర్వమును పూనుచుండుట ఆశ్చర్యముకాదా?"

828. భగవంతునియొక్కయు, గురువుయొక్కయు, సాధుసత్తమునియొక్కయు, అనుగ్రహములను పొందినను, ఒకదాని అనుగ్రహములేకపోయెనా, జీవునికి నాశము తప్పదు. ఒకడు అదృష్టవశమున పైమూడురకములగు వరములను పొందుగాక, వానిహృదయము తనను తాను అనుగ్రహించుకొనిన యెడల - తానుతరించవలయునను ఆతురపాటు దానికిలేనియెడల - ఎన్నియున్నను నిష్ఫలము!

829. సాధనాక్రమము మూడుతరగతులగనుండును:- (1) పక్షుల స్వభావముగలది (2) కోతుల స్వభావముగలది. (3) చీమల స్వభావముగలది.

1. పక్షివచ్చిఒకపండును పొడుచును. ఆపోటుతో పండుక్రిందపడిపోవును. ఇక అది పక్షికిదొఱకదు. (అటులనే కొందఱుసాధకులు అతితీవ్రముగా సాధనలను సాగింతురు. వారితీవ్రతయే వారిప్రయత్నములను భగ్నముచేయును.)

2. కోతి పండును నోటకఱచుకొని, కొమ్మనుండికొమ్మకుదుముకులాడుట దానిస్వభావము. ఇట్లుదుముకులాడునప్పుడు పండు దానినోటినుండి జారిపోవుచుండును.

(అటులనే సాధకుడు కొన్నికొన్ని సమయములందు జీవనక్లిష్టసమస్యలు వచ్చినప్పుడు తనసాధానా విధానమును జారవిడుచును. పట్టునిలుపుకొనలేడు.)