పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

264

(2) సమంజసప్రేమ అన్యోన్యమైనది. ప్రియుడు తన ప్రేయసి ఆనందమునేగాక తనసౌఖ్యమునుగూడ జాగ్రత్తగ చూచుకొనును.

(3) సాధారణప్రేమ అధమము. ఇందు నరుడు తనసుఖమునే చూచుకొనునుగాని తన ప్రేయసి సుఖదుఃఖములను పాటింపడు.

746. శ్రీశంకరాచార్యులయొద్ద ప్రతి యంశమునను వారిని అనుకరించు ఒకానొక మూర్ఖశిష్యుడుండెను. శ్రీశంకరులవారు "శివోహం" అనునప్పుడెల్ల ఆతడును "శివోహం" అనెడివాడు. వానికి బుద్ధిగఱపనెంచి శ్రీశంకరులవారు కమ్మరికొలిమిప్రాంతమున పోవుచు మూసలో కరగియున్న లోహమును తీసికొని త్రాగినారు; మఱియు శిష్యునికూడ అటులనే త్రాగమనిరి కాని గురునివలె ఈపనిని శిష్యుడు చేయజాలక పోయెను. అప్పటినుండి "శివహోం" అనుటయు మానినాడు. క్షుద్రానుకరణము ఎన్నడునుకూడదు. పెద్దల నడవడిని జూచి తమసు వర్తనము సవరించుకొనుట సర్వత్ర తగును గాని, అర్థహీనపు అనుకరణములు చేటుదెచ్చును.

747. సంసారములోనుండి బ్రహ్మజ్ఞానమును చెందిన వారెవరైన జనకమహారాజును ఉదాహరణగా ఎల్లప్పుడు చెప్పుదురు. మానవచరిత్రలో అట్టి ఉదాహరణ యిది ఒక్కటియే! సాధారణముగా సంసారములోనుండి కామినీ కాంచన విసర్జనలేనిది బ్రహ్మసాక్షాత్కారము పొందుట దుర్లభము. శ్రీజనకమహారాజు ఒకడే కామినీకాంచన