పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

265

40వ అధ్యాయము.

విసర్జనలేక అట్లుబ్రహ్మజ్ఞానముపొందినది. నీవున్ను జనకుడవని తలంచవద్దు. ఎన్నియుగములో గడచినవిగాని ప్రపంచములో మఱియొకజనకుడు యింతవఱకును పుట్టియుండలేదు.

748. పాచి చిన్నచిన్న ముఱుగుడుగుంటలయందు పెరుగునుగాని, మిక్కిలి పెద్దసరస్సులందు పెరుగదు. అటులనే స్వార్థపరత, కపటము, మూర్ఖతమూలముగా వెలసినకూటములందు పాక్షికసంప్రదాయము వర్ధిలును; కాని నిష్కళంకములై విశాలాశయములుగలిగి, స్వార్థరహిత వర్తనముతో వెలయు సమాజములందు అట్టిసంకుచిత విషయములు ప్రవర్ధనము కాజాలవు.

749. హిందూమతమునకును బ్రహ్మసమాజమతమునకును బేధమేమని ఒకబ్రహ్మసమాజభక్తుడు ప్రశ్నించగా శ్రీపరమహంసులవారిటులతెలిపిరి:- ఏకస్వరమునకును రాగమునకును గలభేదమేవానికున్నది. బ్రహ్మసమాజము "బ్రహ్మమను" ఒక్కస్వరముతో తృప్తిచెందుచున్నది. హిందూమతమున చాలస్వరములుకూడి మధురమౌ రాగముగ నేర్పడుచున్నవి.

750. భావమును స్వరూపమునుగూడ పాటించుడు; లోపలనుండు భావనయు పైకికాన్పించు ప్రతీకమును మాన్యములే.

751. వరిగింజ మొలకయెత్తి పెరుగుటకు అందుండు అంకురమే ముఖ్యావసరమయినదనియు, పైనిఊకప్రధానమైనది కాదనియు సామాన్యముగ తలంతురు. అయినను ఊకను తొలగించి బియ్యపుగింజను నేలలో నాటినయెడల, అందుండి