పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

263

40వ అధ్యాయము.

ఉ:- తండ్రితోడనో, తల్లితోడనో లేక భార్యతోడనో తగవుల బెట్టికొని సన్యసించినవానిని ఆతురసన్యాసి అనవచ్చును. వాని సన్యాసము తాత్కాలికము; ఏ ధనికుడో లాభాసాటిపనిని చూపినయెడల అది ఎగిరిపోవును.

744. పరమహంసులవారు ఉన్మాది (పిచ్చివాడు) అనియు చాలమంది ఐరోపా జిజ్ఞాసువులవలె ఏదో విషయముంగూర్చి కలతచెందగా వారిమనస్సు వికలమైనదనియు ఒకానొక బ్రహ్మసమాజ భోదకుడు పలికినాడు. కొంతకాలమునకు శ్రీపరమహంసులవారు వానితో ముచ్చటించుచు ఇట్లనిరి:- "యూరపునందు సయితము విద్యాధికులు ఏదోవిషయమును గూర్చి గాఢతర విచారణను పెట్టుకొనుటచేత పిచ్చివాండ్రగుదురని మీరు చెప్పుదురు. సరే వారి విచారణాంశము బౌతికమా? పారమార్థికమా? భౌతికమైనయెడల, భౌతిక పదార్థములగూర్చి నిరంతరము యోచనచేయువారు పిచ్చి వారగుటలో ఆశ్చర్యమేమున్నది? కాని ఏజ్ఞానము జగమునంతను ప్రకాశింపజేయునో ఆజ్ఞానముంగూర్చి మననము చేయుటవలన నరుడు జ్ఞానశూన్యుడగుటెట్లు? మీశాస్త్ర గ్రంథము లటుల బోధించునా?

745. ప్రేమ మూడురకములు :- (1) స్వార్థరహితమైనది (సమర్థము) (2) పరస్పరము (సమంజసము) (3) స్వార్థమగు సామాన్యప్రేమ (సాధారణము)

(1) సమర్ధప్రేమ ఉత్తమమైనది. ప్రియుడు ప్రేయసీ యొక్క క్షేమమునే గమనించునుగాని, తనకష్టములను బాధలనుగూడ సరకుచేయడు.