పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

230

నీవెంత జాగ్రత్తతో మెలగినను, ఎప్పుడో కొంతమసి అంటుకొనక తప్పదు గదా!

649. చిన్నబిడ్డలు తల్లిని వదలి దూరముగ గదిలో బొమ్మలను పెట్టుకొని యధేచ్ఛగా ఆటలాడుకొనుచుంద్రు. కాని తల్లిరాగానే బొమ్మలనన్నిటిని త్రోసివేసి అమ్మా! అమా! అని కేకలువేయుచు ఆమెచుట్టు చేరుదురు. మీరలు కూడ ఈ ప్రపంచములో, సంపదలు, గౌరవములు, కీర్తులు మొదలగు బొమ్మలతోడి ఆటలందు మఱిగి యున్నారు! ఇతరమేమియు మీకక్కఱలేదు. కాని ఒక్కసారి మీరా జగజ్జననిని మీహృదయములో కాంచితిరేని, ఈ సంపదలు ఈ ఖ్యాతులు, ఈ గౌరవములు మీకింక ఆనందము నొసగ జాలవు. వీనిని సర్వము విడిచివేసి ఆతల్లికడకు పర్విడుదురు!

650. సమస్తమును త్యాగముచేసి, భగవంతుని పాదారవిందములకడచేరుడని మీరు సంసారులను కోరినయెడల వారు మీమాటాలకించరు. కావున చాలగా ఆలోచనచేసి యీమానవులను ఆలర్షించుటకొఱకు చైతన్యనిత్యానందులు ఒకయుపాయమును పన్నిరి. "సోదరులారా! హరినామ స్మరణచేయుచు పాయసముల గుడువుడు. వన్నెకత్తెల కౌగిండ్ల ననుభవించుడు." రండు! రండు! అని బోధించుచు వారికి ఎఱజూపిరి. వీనికాశపడి ప్రజలు భగవన్నామ సంకీర్తనము చేయుటకై గుమిగూడెడివారు. కాని వలలోచిక్కుకొనెడి వారు. క్రమక్రమముగా వారు భగవన్నామామృతమును గ్రోలినకొలదిని, నిత్యానందుని బోధలోని రహస్యార్థము