పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

229

34వ అధ్యాయము.

అటులనే ఓ సంసారీ! చేతులతో నీకుటుంబ వ్యవహారముల నన్నిటిని చేసికొనుచుండుము. కాని పూర్ణహృదయముతో భగవన్మహిమలను తలంచి గానము చేయుచుండుము.

647. బాలుని హృదయమందలి ప్రేమ పూర్ణముగను అభిన్నముగను నుండును. కొన్నాళ్లకు అతనికి పెండ్లికాగనే సగముహృదయమైనను భార్యకు పంచబడును; ఇక బిడ్డలు పుట్టినప్పుడు యింకొక పాతికభాగము వారికి పోవును; మిగతా పాతికభాగమును వాని తల్లి, తండ్రి, గౌరవము, మర్యాద, వేషము, పౌరుషము మున్నగువానికి పోవును. అందువలన భగవంతునికై అర్పణ చేయుటకు వానియొద్ద ప్రేమ మిగులకుండును. కాబట్టి బాలుడుగనుండగ, పంపుడు పడిపోకుండ వాని హృదయము పూర్ణముగ నున్నప్పుడే, పెందలకడ వాని హృదయమును భగవంతునికై త్రిప్పిన యెడల, అతడు భక్తుడై, సులభముగా దైవమును కాంచ గల్గును. కాని పెద్దవారైన మానవులు అటుల చేయజాలుట సులభము కాదు.

648. సంసారముననే నిలుచు జ్ఞానులకును, సన్యాసము పుచ్చుకొను జ్ఞానులకును భేదమేమని మీరు నన్ను ప్రశ్నించినయెడల, యిరువురును సములని నేను చెప్పుదును. ఇరువురకును జ్ఞానము సమమే; ఒక్కటే. కాని సంసారియై జీవించు జ్ఞానికి, ఏకొలదిగనైనను, కామ్యకర్మల ఆకర్షణ యుండును గాన భయ కారణము కలదు. పొగచూరియున్న గదిలో