పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

225

34వ అధ్యాయము.

యును. తనకు ఎట్టి పరిస్థితులు వాటిల్లినను కూడ, తనహృదయము న్యాయమార్గము తప్పిపోకుండ జాగ్రత్త పడవలయును.

636. దిక్చూచి యందలి (కాంతశక్తిభరితమగు) సూది నిరంతరము ఉత్తరదిశను చూపుచుండును. అందువలన ఓడ దారితప్పకుండ సముద్రముపైని పోగల్గుచున్నది. అట్లే మానవునిహృదయము భగవంతునివైపు తిరిగి యున్నంతకాలమును ఆతడుసంసారసాగరమున దారితప్పకుండ పోగలడు.

637. నీవుధ్యానముచేయు సమయమునందు, ధ్యానమనగా హేళనచేయునట్టియు, సాధువులను సాధువర్తనమును నిరసించునట్టియు జనులకు దూరముగ పొమ్ము.

638. వ్యభిచారిణియగు వనిత తన యింటిపనుల నన్నిటిని సవరించుకొనుచును తనమనస్సును విటునిపైననుంచు తీరున, ఓగృహస్థుడా! నీసంసార వ్యవహారములనన్నింటిని నిర్వర్తించుకొను చుండుము; అయినను నీహృదయమును భగవంతుని పైని నిలుపుము.

639. శ్రీమంతునియింటబిడ్డకు పాలిచ్చుదాది, ఆబిడ్డను తన బిడ్డవలె ప్రేమతో చూచును. తనబిడ్డకాదని సదా గుర్తునుంచుకొనియే వర్తించును. అటులనే నీవునీబిడ్డలకు పోషకుడవును, ఉపచారకర్తవుమాత్రమే అనియు, వారి నిజమగు తండ్రి భగవంతుడనియు సదా జ్ఞప్తినుంచుకొనుము.

640. ఒకనాడు కొందఱు బ్రహ్మసమాజపు బాలురు తాము జనకుని ఆదర్శమును అనుసరించుచు సంగములేకుండ కుటుంబమున మెలగుచుంటిమని నాతోచెప్పిరి. నేనిట్లుపలికితిని:-