పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

224

కాలిమీదపడి హానిచేయకుండ అతిజాగరూకతతో మెలగుచున్నది. ఆవిధముగా నీవు సంసారములో నుండుము; కాని సర్వదా భగవంతుని సంస్మరించుచుండుము; వాని మార్గము నుండితొలగి ఎన్నడును వర్తించకుము.

634. మొసలికి నీటిపైని ఈదులాడుటయిష్టము. కాని అది పైకిరాగానే వేటగాండ్రు దానిపై గురిపెట్టుదురు. కావున విధిలేక అదినీటిలోపలనేయుండవలసినదై పైకిరావీలులేకుండును. అయినను సురక్షితముగాపైకివచ్చుటకు అవకాశము చూపట్టినప్పుడెల్ల, బుస్సలుకొట్టుచు పైకిలేచి, ఆనందముతో నీటిపైని ఈదులాడును. ఓమానవా! సంసార సాగరములో తగుల్కొని నీవు ఆనందసాగరో పరిభాగమున ఈదులాడ వాంఛించుచున్నావు. కాని సంసారతాపత్రయములు నీకవకాశము నొసగుటలేదు. అయినను దిగులుపడకుము. తీరికిచిక్కినప్పుడెల్ల ఆతురపడి భగవంతుని పిలువుము, భక్తిమెయి ప్రార్ధింపుము, నీదుఃఖముల నన్నిటిని వానికి తెలుపుకొనుము. సమయము వచ్చినప్పుడు భగవంతుడు నిన్ను రక్షించి ఆనందసాగరమున ఓలలాడ జేయగలడు.

635. యువతులు నాలుగైదు కుండలను దొంతరగా తలమీద పెట్టుకొని నీళ్లుతెచ్చికొనునప్పుడు, త్రోవలో తమ కష్టసుఖములను గుర్చించి ఒండొరులతో ముచ్చటలాడుకొనుచు పోదురు. అయినను ఒక్కకుండలోని నీరైనను తొణికి పోనీయరు. ధర్మమార్గమున నడచుయాత్రికుడు అటుల వర్తించవల