పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

226

"ఆమాటచెప్పుట సులభమే. కాని నిజముగా జనకునిబోలి వర్తించుటవేఱు. తగులుపడకుండ సంసారవ్యవహారముల నడపుట అతిదుర్ఘటము. ప్రారంభదశలో జనకుడు ఎట్టినిష్ఠురనీమముల నవలంబించెనో తెలియునా? కాని మీరందఱు అట్టి కఠిననియమములను అనుసరింపుడని చెప్పను. కాని భక్తిని సాధనచేయవలయుననియు, శాంతిగలచోట కొంతకొంత కాలము నివసించుడనియు మిమ్ముకోరుచున్నాను. కొంచెము జ్ఞానము, భక్తిని సంపాదించుకొనిన అనంతరము సంసారమున దిగుడు. పాలు కదలకుండ నొకచోటపెట్టినగాని పెరుగుగా తోడుకొనదు. కదలించినను, ఒకకుండనుంచి మరియొక కుండలోనికి మార్చిననుకూడ, పెరుగుచెడును. జనకుడు నిస్సంగుడు; అందువలన వానిని "విదేహుడ" నియు పేర్కొందురు. ఆతడు జీవన్ముక్తుడై మెలగినాడు. దేహస్ఫురణను రూపుమాపుట చాలకష్టమగు సాధన. జనకుడు మహావీరుడు సుడీ! ఒకచేత జ్ఞానము, రెండవచేత కర్మ అను రెండుఖడ్గములను అవలీలగ ధరించిన ధీరుడు!"

641. నీవు నిస్సంగుడవై సంసారమున వర్తించ కోరుదువేని, ఒక సంవత్సరమో, ఆరునెలలో, ఒక్క నెలయో, తుదకు పండ్రెండు దినములైనను ఏకాంతస్థలమున, మొదటగా భక్తిసాధనచేయ వలయును. ఏకాంతవాసకాలమున భగవంతునిగూర్చి నిరంతరధ్యానము చేయవలయును; భక్తిని ప్రసాదింపుమని దేవుని వేడుకొనవలయును. ఈప్రపంచములో నీవు నీదనుకొనదగినది యిసుమంతయు లేదనుభావ