పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

221

33వ అధ్యాయము.

బోలునది; అది దివ్యజ్ఞానానందములను నిండుగ గ్రోలును. మూడవది నలుసంత సత్యజ్ఞానమునై నను హృదయమున చొఱనీయని లౌకికవ్యావృత్తిగలవాని బోలునది.

627. అన్నినీళ్ళును నారాయణ స్వరూపమే; కాని అన్నిరకముల నీళ్ళును త్రాగుటకు పనికిరావు. అటులనే అన్ని ప్రదేశములందును భగవంతుని నిలయము లనుటనిజమే. అయినను అన్నిప్రదేశములును నరుడు దర్శించదగినవిగ నుండవు. ఒకరకమునీరు కాళ్ళుకడిగికొనుటకు మాత్రము ఉపయోగించును; వేఱొకరీతినీరు పుక్కిలించుటకు పనికిరావచ్చును; మఱొకరీతినీరు త్రాగుటకుఅర్హముగనుండును. కొన్నిరకముల నీరు ఎందుకును కొఱగాక తాకుటకుగూడ పనికిరాకుండును. అట్లేవేర్వేఱుస్థలములున్నవి. కొన్నింటిసమీపమునకుమాత్రము పోదగును; కొన్నింటిలోనికి చొఱదగును. మఱికొన్నింటిని దూరమునుండిచూచుటకును దగకుండును.

628. పులిలోసయితము దేవుడుకలడనుట సత్యమే. ఆకారణముచేత మనము సమీపమునకుపోయి ఆజంతువునకు ఎదుఱుగ నిలువరాదు. అతినీచపురుషులందును భగవంతుండుట నిజమే. అంతమాత్రాన మనమందఱితోడను సహవాసము చేయదగదు.

629. ఒకబ్రాహ్మణుని కుమారుడు పుట్టువుచేత బ్రాహ్మణుడగుచున్నాడు. అయినను అటులపుట్టువుచే బ్రాహ్మణులైనవారిలో కొందఱుమాత్రమే పండితులగుచున్నారు; కొందఱు పురోహితులగుచున్నారు; మఱికొందఱు వంటవారగు