పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

220

వచ్చును. వేఱొకటి నల్లగానుండవచ్చును. కాని అన్నింటిలో నుండునది ఒకేరకపు దూదియే. నరుల స్థితియు యిట్లే యుండును. ఒకడు సుందరరూపి, మఱొకడు నల్లనివాడు; ఇంకొకడు ధర్మాత్ముడు, వేఱొకడు ధూర్తుడు. అయినను వారందఱిలోపలను ఒకే పరమాత్మయే వసించుచుండును.

625. పల్లెకారి యొకడు ఏటిలో వలవేయగా చాలచేపలు పడినవి. కొన్నిచేపలు వలలో నిశ్చలముగ కదలక పడియున్నవి. అవి వలనుండి బయటపడవలయునని యత్నమే చేయవు. కొన్ని గంతులువేసి చాలపెనగులాడినవి; కాని తప్పించుకొనలేవయ్యెను; మఱికొన్ని చేపలుమాత్రము ఏదో తీరున తప్పించుకొని బయటపడినవి. ఈతీరున ప్రాపంచిక జనులు మూడురకములవారు కాన్పించు చున్నారు.

(1) బంధనమున జిక్కియు యెన్నడును విడివడ ప్రయత్నము చేయనివారు.

(2) పెనగులాడువారు - ముముక్షువులు.

(3) ముక్తులు - స్వేచ్ఛను పొందినవారు.

626. మూడుబొమ్మలున్నవి:- ఒకటి ఉప్పుతో చేసినది; రెండవది గుడ్డతో చేసినది, మూడవది రాతిలో చేసినది. ఈ బొమ్మలను నీటిలోముంచినయెడల మొదటిది కఱగిపోయి రూపనాశమునందును; రెండవది చాలనీటిని పీల్చుకొనును; కాని ఆకారమున మారదు; మూడవది నీటిని తనలో చొఱనీయదు. మొదటిబొమ్మ తన జీవాత్మను విశ్వాత్మలో చేర్చి సర్వాత్మత్వమున బడసిన నరుని వంటిది. రెండవది భక్తుని