పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

222

చున్నారు. ఇంకకొందఱు భోగకాంతవాకిట ధూళిలోపడి కొట్టుకొను వారగుచున్నారు.

630. ఈక్రింద పేర్కొనబడు వారింగూర్చి జాగ్రతతో నుండగావలయును.

(1) (హద్దుపద్దులేకుండ) సతతము వాగుచుండు నోరు గలవాడు.

(2) కపట హృదయము గలవాడు.

(3) చెవులలో తులసియాకులను ధరించి మహాభక్తుని లీల నటించువాడు.

(4) నిండాకు ముసుగువేసికొని నడయాడు స్త్రీ

(5) మిగుల అనారోగ్యకరమగు సాకుడుతో నిండియున్న మురుగుడు గుంటలోని చల్లనినీరు.