పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

209

30వ అధ్యాయము.

పోయినవి. నాకు బాహ్యప్రపంచ స్ఫృహయే లేదయ్యె. అప్పుడు నాజందెమునుగాని కట్టుకొనిన బట్టనుగాని జాగ్రత్తచూచువారెవరు? తీవ్రమగు బ్రహ్మభావనయందు మునిగిపోయి, ప్రతిదినము చాలసేపు కట్టుబట్టకూడ లేక దిస మొలతో నుంటిననియు నాకు తెలియలేదు. కృష్ణకిశోరు జందెము తీసివేసితినని నన్నాక్షేపించినప్పుడు "భగవంతుని గూర్చిన పారవశ్యత నిన్ను ఆవేశించినప్పుడు నీకివిషయము స్పష్టపడును లెమ్ము' అంటిని.