పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31వ అధ్యాయము.

భక్తుల లక్షణములు

596. బాగుగబరువులతోనింపిన రైలుబండ్లవరుసను ఇంజను సులభముగ లాగికొనిపోగలదు. అటులనే భగవంతుని ప్రియసంతానము భక్తివిశ్వాసభరితులై ఐహికజీవనపు కష్ట నిష్టురములను భరించుటలో దిగులుపడరు. మఱియు అనేకులను భగవంతునివైపునకు త్రిప్పి నడుపగలరు.

597. చకుముకిరాయి, యుగాంతరములుగ నీటియడుగున పడియుండినను దానిలోనిఅగ్నిని కోలుపోదు. నీయిష్టము ఎప్పుడైననుసరియే దానినిఉక్కుతోకొట్టుము. తళుక్కుమని అగ్నినివెలిగ్రక్కును. గాఢవిశ్వాసముగల భక్తుడట్టులుండును. సంసారికమలములు వానిని ఎన్నిచుట్టుకొనియున్నను వాని భక్తివిశ్వాసములకు నాశముండదు. భగవన్నామము చెవిని బడినతోడనే అతడు భక్తావేశము పూనగలడు.

598. ప్రశ్న:- భగవద్భక్తుని బలము ఎందున్నది?

ఉ:- అతడుభగవంతునిబిడ్డ! భక్తిచేవెల్లివిరియు ఆనందబాష్పములు వానికి అవిజేయమగు ఆయుధము!

599. ఒక జ్ఞానియు, ఒకభక్తుడును, అడవిగుండ పోవుచుండిరి. త్రోవలో వారికి ఒకపులి కాన్పించినది. "మనము పాఱిపోవలసిన కారణము కాన్పించదు. సర్వశక్తిమంతుడగు