పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

202

ఆదివ్యమాతయే వేఱొకరీతిని లీలసలుపుచున్నటుల నాకు గోచరించును.

578. క్షమయే సన్యాసికి ప్రధానలక్షణము.

579. నీటముంచిన కడవలోపల నిండుగ నీరుండును; మఱియు దానిచుట్టుకూడ నీరుండును; అటులనే భగవంతుని యందు నిమగ్నమైన జీవునియందు పరమాత్మ సర్వవ్యాపియై, బాహ్యమునగూడ ఎల్లెడల నావరించియుండును.

580. శాంతి ధర్మములతో జీవనముగడపుచు ప్రజల నిందా స్తోత్రములు సరకుగొనక వర్తించుము.

581. మనుజుడు మైదానముపైనున్న సమయమున అల్పమగు గడ్డిని మహోన్నతములగు మఱ్ఱిచెట్లనుచూచి "ఆహా! ఈవృక్షము ఎంతఉన్నతమైనది! ఈగడ్డి ఎంతకొద్దిది!" అనుచుండును. ఆతడేపెద్దపర్వతమునెక్కి ఎత్తగుదానిశిఖరమునుండి చూచునప్పుడు గడ్డియు వృక్షమును వేఱుపఱచుటకు వీలుగాని పచ్చని తృణజాలముగ గోచరించుట తెలియును. అటులనే లౌకికపురుషుల దృష్టిలో సంపత్తు, ఉద్యోగము, మున్నగుభేదములు తోచును. ఒకడు రాజ్యముపాలించురాజు, మఱొకడు చెప్పులుకుట్టు మాదిగ, ఒకడుతండ్రి వేఱొకడు కొడుకు, ఇట్లెన్నియోభేదములు కాని దివ్యదృష్టి ప్రాప్తించినవానికి సర్వమును సమమైతోచును; ధర్మాధర్మములు, ఉత్తమాధమములు అను తారతమ్యములు రూపుమాసిపోవును.

582. ఒకసారి భక్త్యావేశముతో పరవశుడైయున్న సాధు వొకడు శ్రీరామకృష్ణపరమహంసులవారుండు రాసమణీదేవి