పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29వ అధ్యాయము.

జ్ఞానియొక్క సమదృష్టి.

575. గాలి శ్రీగంధపుసువాసనను, ముఱుగుడు పీనుగు వెలిగ్రక్కు చెడుకంపునుకూడ మోసికొని పోవును. కాని ఆగాలి వీనితో కలియదు. అదేవిధముగా ముక్తాత్ముడు ప్రపంచములో నివసించుచుండును, కాని ఆప్రపంచములో కలిసిపోడు.

576. సాధువొకడు జనముతో నిండియున్నవీధిలోపోవుచు, ఒకదుష్టుని కాలివ్రేలును పొఱబాటున త్రొక్కుట తటస్థించెను. ఆదుష్టుడు కోపావేశుడై, ఆసాధువుని స్మృతితప్పిపడిపోవునటుల నిర్దయుడై మోదెను. ఆసాధుని శిష్యులు చాలశ్రమచేసి, అనేక ఉపచారముల సలిపి వానికి స్మృతితేర్చిరి. వానికి కొంచెము స్ఫృహరాగా "స్వామీ! మీకీ ఉపచారములు చేయునదెవరో గుర్తుతెలియునా?" అని అడిగిరి. "ఆహా? నన్ను కొట్టినయతడే సందేహ మేమి?" అని ఆసాధు సత్తముడు జవాబుచెప్పెను. నిజమగుసాధువునకు శత్రుమిత్రులను భేదభావము తోచదు.

577. సద్వంశీకురాండ్రగు పుణ్యస్త్రీలను చూచునప్పుడు, పతివ్రతా వేషముదాల్చి నిరాడంబరముగ నాజగజ్జననియే వారియందు నాకు కానవచ్చును. మఱియు అత్యాడంబరముతో సిగ్గునువిడిచి శృంగారించుకొని వీధిపంచలందు కూర్చుండు నగరవ్యభిచారిణీస్త్రీలను చూచినప్పుడును, నాకు