పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203

29వ అధ్యాయము.

గారి కాళీదేవళమునకువచ్చెను. ఒకనాడు ఆయనకు భోజనము దొఱకలేదు; అకలిగానున్నను ఆయన ఎవరిని యాచించలేదు. భోజనానంతరము ఎంగిళ్లుపాఱవేయుగొందిలో ఆకులనాకుచున్న కుక్కకడకుపోయి ఆయన "అన్నా! నాకుపాలీయ కుండ ఒంటరిగ నీవేతినుచున్నావా?" అనెను. అట్లనుచు కుక్కతోకూడ కలిసితినసాగెను. అట్టివింత సహవాసగానితో భోజనముచేసిముగించి, కాళీమాతయాలయమునకు తిరిగివచ్చి దేవళములోనివారికెల్ల గగుర్పాటొదవునటుల మహా భక్త్యావేశముతో ఆయన దేవీస్తోత్రము చేయగడంగెను. కొంతవడికి ప్రార్ధననుముగించి ఆయన వెడలిపోవుచుండగాంచి, తనబంధుడగు హృదయముఖర్జీగారిని ఆయనవెంటబోయి ఆయన యేమనునో తిరిగివచ్చి చెప్పుమని పరమహంసులవారు పంపిరి. హృదయుడు వానివెంట కొంతదూరము పోయెను. ఆసాధు సత్తముడు వెనుకకుతిరిగి "నీవు నావెంటవచ్చుచుంటివి, ఏల" అని అడుగగా స్వామీ! నాకేమేని బోధచేయుము! "అని హృదయుడు పలికెను. అంతట ఆమహానీయుడిట్లుపదేశించెను. "ఈముఱికి గోతిలోని నీరును, ఆపాసనగంగాజలమును నీకెప్పుడు సమమైతోచునో, వేణుగానమును అల్లరిమూకల గోలయు నీచెవికి ఎన్నడు సమానముగతోచునో, అప్పుడు నీవు పరమజ్ఞానావస్థను పొందినట్లగును."

హృదయుడు మరలివచ్చి యీమాటలను పరమహంసులవారికి వినిపించగా వారిట్లనిరి. "ఆపురుషుడు సమాధిస్థితిని జ్ఞానసిద్ధిని పొందినవాడు. సిద్ధత్వమును పడసినయతడు