పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

193

27వ అధ్యాయము.

ఆమె తనబిడ్డను దినమంతయు లాలనసేయుచు, ఆనందముతో ముద్దులాడుచు నుండును. ఈతీరుగ, పామరత్వమున నున్న మనుజుడు నానావిధకర్మలను జేయుచు దీరికలేకుండును. కాని వాని హృదయములో ఈశ్వరసాక్షాత్కారమైన తోడనే వానికిఆకర్మకలాపమునఆనందముండదు. ఇప్పుడతడు సదా భగవత్సాక్షాత్కారము ననుభవించుచు, వాని యిచ్చను పాలించుచు మురియుచుండును. వానికింక ఏయితర వ్యాపారమునందును సంతోషము కలుగదు. ఆదైవసంసర్గముయొక్క ఆనంద పారవశ్యమును పోగొట్టుకొన నిష్టపడడు.

556. కప్పపిల్లయొక్క తోక రాలిపోయినపిమ్మట, అది నీళ్ళలోను మెట్టమీదనుకూడ నివసించగలదు. భ్రాంతిగొలుపు అజ్ఞానమను తోకరాలిపోయిన మనుజుడు ముక్తుడగును. అంత నాతడు భగవంతునిలోను లోకములోను భేదములేక యుండగలడు.

557. యూదియా జాతివారు ఏసుక్రీస్తును శిలువపైని మేకులతో బంధింపజేసినప్పుడు, తాను అత్యంతబాధానుభవమునందుండియు, ఏసుక్రీస్తు "వారుక్షమింపబడుదురుగాక"యని ప్రార్ధించగల్గుటకు హేతువేమి;

పలుగుతోగ్రుచ్చి లేతకొబ్బరికాయ పెచ్చుతీయునప్పుడు, పలుగు దానికొబ్బరిలోనికి కూడ దూరిపోగలదు. కాని కురిడీకాయ లోనికొబ్బరి, చిప్పనుండివేఱుపడియుండి, పలుగుచే చిప్పపగిలినను లోని కురుడీ హానిచెందకయుం