పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

192

తత్వమును గట్టిగ పట్టుకొంటివా నీవన్నింటి తత్వమును ఎఱింగిన వాడవగుదువు.

553. సమద్రమునమునిగియున్న సూదంటురాతికొండ దానిపైగపోవు ఓడను ఆకర్షించి, దానియందలి యినుపమేకుల నన్నింటిని లాగివేయును. అంతట ఓడచక్కలన్నియు, ఒక దానినుండి యొకటి సడలిపోయి, ఓడసముద్రమున మునిగిపోవును; అటులనే భగవంతుని ఆకర్షణశక్తి అనగా విశ్వచైతన్యశక్తి జీవాత్మను ఆకర్షించునప్పుడు, ఒక్కక్షణములో నరుని వ్యక్తిత్వభావమును స్వార్ధపరతయు రూపుమాయును. అంతటజీవాత్మ భగవంతుని అనంతప్రేమజలధియందుమగ్నమై పోగలదు.

554. పాలునీటితోచేరినప్పుడు సులభముగా దానితో కలిసిపోవును. ఆపాలనే వెన్నగామార్చుము. అప్పుడది నీటిలో కలిసిపోక దానిపై తేలియాడును. అదేవిధముగ జీవాత్మఒక్కసారి బ్రహ్మభావనను పడసెనా, అది నిరంతరము, అనుక్షణము, అనేకములగు ప్రబోధశూన్యములగు జీవాత్మలతో కలిసియుండుగాక, ఆదుస్సాంగత్యము దానిని చెరుపజాలదు.

555. క్రొత్తగా కాపురమునకువచ్చిన యువతి గృహకృత్యములందు గాఢముగమునిగియుండును; అటులుండుటఆమెకు పుత్రుడొకడు పుట్టువఱకే. ఆమెకుపుత్రోదయము కాగానే, సామాన్యపు యింటిపనులనన్నింటిని ఆమె విడిచివేయును. వాని యందామెకు ఉత్సాహముండదు. అందుకుమారుగా