పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

194

డును. ఏసుక్రీస్తు కురిడీకాయవంటివాడు; వానిఆత్మ వాని స్థూలశరీరమునుండి విడిపోయినది. కాబట్టి వానిస్థూలశరీరబాధ వానిని అంటలేదు. గ్రుచ్చిగ్రుచ్చి వానిశరీరమున మేకులు కొట్టినను, ఆయన పరమశాంతముతో శత్రువులక్షేమముకొఱకై ప్రార్ధన చేయగల్గినాడు.

558. ఈప్రపంచములో అయిదురకముల సిద్ధులు కాన్పించుచున్నారు.

(1) స్వప్నసిద్ధులు:- కలలయందు సుబోథముపొంది పరిపూర్ణతను పడసినవారు.

(2) మంత్రసిద్ధులు :- ఏదేని పవిత్రమంత్రోపాసన మూలమున సిద్ధత్వము నందినవారు.

(3) హఠాత్సిద్ధులు:- ఆకస్మికముగా గొప్పధననిధిని కనుగొనియో లేక శ్రీమంతురాలిని పెండ్లియాడియో ధనికుడయిన పేదవానిబోలి తటాలున పూర్ణత్వమును పొందినవారు ఇట్లు అనేకులు పాపులుయేదోతీరునహఠాత్తుగ పావనులై దేవరాజ్యముంజేరుదురు.

(4) కృపాసిద్ధులు:- ఈశ్వరానుగ్రహ ప్రాప్తిచేత పరిపూర్ణులగువారు. ఒకడు అడివిని నఱుకుచుండగా వానికొక ప్రాచీనసరోవరమో లేక భవనమో కాన్పించుననుకొనుడు. అతడికిబాధలుపడికష్టములకోర్చి వానిని నిర్మాణము చేసికొను యవసరముండదుగదా! ఆతీరుననే అదృష్టవశమున తామేమియు ప్రయత్నముచేయకయే పూర్ణజ్ఞానులగుట కలదు.