పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

180

528. సచ్చిదానందమయుడగు భగవంతును తనతో చేర్చి బంధించుకొనుటకై భక్తుడు చేతబూను త్రాడువంటిది ప్రేమ. దాని సాయమున భక్తుడుభగవంతుని తనస్వాధీనమున నుంచుకొనును అనవచ్చును. అతడు పిలుచునప్పుడెల్ల భగవంతుడు వానికడకు వచ్చును.

529. పారశీకపు గ్రంధములలో నిట్లువర్ణింపబడియున్నది. మాంసములోపల ఎముకలున్నవి. ఎముకలలోపల మజ్జా యుండును. వాని అన్నింటిలోపలను ప్రేమయుండును.

530. శ్రీకృష్ణునకు త్రిభంగనామముకలదు; అనగామూడువంపులుతిరిగినవాడని అర్ధము. మెత్తని వస్తువుమాత్రమే వంచినప్పుడిట్లు వంగగలదు. కావున శ్రీకృష్ణుని యీరూపము ఆయన యేకారణముచేతనో మెత్తబడియుండునని తెలుపుచున్నది. ఈ మెత్తపాటునకు ప్రేమయే కారణమందురు.

531. శ్రీరామకృష్ణ పరమహంసులవారు కేశవచంద్రసేనులవారితోనిట్లనిరి:- మీబ్రహ్మసమాజమువారు భగవంతునిచైదములను అంతగాస్తోత్రములు గావించుటేల? "ఓదేవా! నీవు సూర్యుని సృష్టించినావు; చంద్రునిచేసినావు; నక్షత్రములను నిర్మించినావు!" ఇట్లేమేమొ అనుచుందురు! పూలతోటయొక్క అందమును - అందున్న చక్కని పూలను, కమ్మని వాసనలను చూచిమెచ్చుకొనేవారు చాలమందియుందురు; కాని తోటయజమానిని విచారించువారు చాలకొలదిమందియే! ఇందు ఘనతరగణ్యత యెవరిది? తోటదా? భగవంతునిదా? మననడుమ మృత్యువు నాట్యము సాగునంత