పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179

25వ అధ్యాయము.

వంతునియెడల తీవ్రభక్తికలుగవలయునని అందఱునుపరితపించినచాలును. సాంద్రభక్తియొక్కటియే ముఖ్యావసరము!

524. పసిబిడ్డయొక్క అమాయికత్వము యెంతమధురమైనది! ప్రపంచమునందలి ధనసంపదల నన్నింటికంటెను ఒక్కబొమ్మయందెంతయో మక్కువచూపునుగదా! విశ్వాసపూర్ణుడగు భక్తుడట్టులుండును. ఇంకెవ్వడును ప్రపంచమందలి ధనములను గౌరవములను విడిచివేసి, భగవంతునితోడిదే లోకమని కూర్చుండబోరు!

525. ఒక్క నిప్పురవ్వ తాకినంతనే కొండంత దూదియైనను దగ్ధమై రూపుమాయుతీరున, భక్తిపూర్వకముగా పావనమౌ భగవన్నామమును గానముచేసినమాత్రాన నీపాపరాసులన్నియు అదృశ్యము కాగలవు!

526. నరకలోకములోని అగ్ని మొదలగువానికి జడిసి పూజలుచేయుట ప్రారంభదశలోనివారికి తగును. పాపమనెడు భావము కలిగి యుండుటతోడనే మతధర్మము పూర్తియగుచున్నదని కొందఱిభావము. అది కేవలము క్షుద్రమగు ప్రారంభదశయనుటను వారు మఱచుచున్నారు. అంతకన్నను ఉత్తమమగు ఆధ్యత్మికదశయున్నది; భగవంతుని మన తండ్రియనియు, మన తల్లియనియుభావించి భక్తిచేయ వలయును.

527. "భావ" భక్తిపూనుదశ పచ్చిమామిడికాయను పోలును; "ప్రేమ" భక్తిదశ మామిడిపండును పోలునది!