పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

181

25వ అధ్యాయము.

కాలము తోట మూడునాళ్లబూటకమే! కాని తోటయజమానియొక్కడే నిత్యసత్యమూర్తి!

సారాయంగడికడ ఒకటిరెండు గ్రుక్కలు త్రాగినపిమ్మట, ఆఅంగడిలో ఎన్నిపీపాలలో ఎంతసారాయి అమ్మకమునకున్నదో అను విచారణ ఎవనికి పట్టగలదు? ఒక్కొక్కనికి ఒక్క సీసా ఎక్కువ! నరేంద్రుడు (వివేకానందస్వామి) కంటపడగానే నేను ఆనందపరవశమున మైమఱతును. మీ నాయన ఎవరనిగాని మీకెన్ని గృహములున్నవనిగాని ఎన్నడునువానిని అడుగనేలేదు.

532. నరులు, తమ సంపదలను అమితముగ గణనచేయుదురు. డబ్బు, యిండ్లు, సామానులు చాలవిలువగలవానిగా చూచుకొందురు. కాబట్టి భగవంతుడును అటులనే తనసృష్టిని గూడ, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను చూచుకొనునని వారు తలంతురు. కావున నరులు ఆయనచైదములనుగూర్చి పొగడ్తలు పలికినప్పుడు భగవంతుడు సంతోషమున ఉబ్బు ననుకొందురు.

533. హఠభక్తిస్వరూపమెట్టిది (Violent from of devotion) "జైకాళీ!" అనుచు సతతము భీకరముగ అఱచు చుండుటయో, లేక "హరీబోలో!" అను గానముతో చేతులెత్తి నృత్యముచేయుటో, పనిగాబూని పిచ్చివారైపోవుటే! ఈకలియుగములో శాంతిరూపములగు ధ్యానాదులకంటె శీఘ్రతరముగ ఫలించునది హఠభక్తియే. దానిసహాయమున భగవంతునికోట సత్వరము స్వాధీనమై పోగలదు.