పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24వ అధ్యాయము.

ధ్యాన నిష్ఠ

490. తీవ్రధ్యాననిష్ట ధ్యేయ వస్తువుయొక్క నిజలక్షణములను ప్రస్ఫుటముగావించి, ధ్యాతయొక్క ఆత్మయందు నెలకొనునటుల చేయును.

491. సాత్విక స్వభావముగలవాడు ఎటుల ధ్యానించునో తెలియునా? ఆతడు అర్ధరాత్రి వేళను, ప్రక్కపై పరుండియు, ముసుగు వేసికొనియు, ఇతరులు తననుచూడ రాకుండ ధ్యానము సలుపును.

492. ప్రారంభదశయందు, మనోసంయమనము చేయునతడు, ఏకాంతస్థలములందు సాధనచేయవలయును; కాదేని అనేక విషయములు వానికి చంచలమును కల్పించును. పాలను నీటినిచేర్చి పెట్టితిమేని అవి కలసిపోవుటసత్యము. కాని పాలను చిలికి వెన్నగాచేసితిమేని, అటుల వెన్నగా రూపాంతరమును పొందినపాలు నీటిలో కలిసిపోవుటకు మారుగా ఆనీటిపైన తేలియాడుచుండును. అదేతీరున నిరంతరసాధనచేసి మనుజుడు ఏకాగ్రచిత్తమును పడసెనా, అది వాని ఆవరణమును ఉల్లఘించి, బ్రహ్మభావమున శాంతి ననుభవించుచుండును.

493. ప్రారంభకుడు ధ్యానసాధన సమయమున ఒకవిధమగు నిద్రలో పడుచుండును. దీనికి యోగనిద్రయనిపేరు; అట్టి