పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165

23వ అధ్యాయము.

హారము భక్తునకు తగదు. కాని నామాటవినుము. ఒకడు పందిమాంసము తినుచునుగూడ, భగవంతునియెడ అనురక్తుడయ్యెనా అతడు ధన్యుడు. మఱియొకడు పరమాన్నమును లేక హవిష్యాన్నమునే ఆరగించువాడైనను, వానిమనస్సు కామినీ కాంచనములందు తగులువడి యుండెనా అతడు హతభాగ్యుడే!

489. నేనొకతరి మహమ్మదీయ గురునిచేత ఉపదేశమును పొంది, అనేకదినములు అల్లాస్మరణచేయుచు, మహమ్మదీయుల ఆచారములనే అవలంబించి వారి ఆహారములనే తినెడివాడను. ఆదినములలోనేను కాళీమాతదేవళమునకు పోజాలక పోతిని; హిందూదేవతానామముల స్మరింపనైన నాకు సాధ్యముకాలేదు.