పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

164

ఆహారమునైనను తినుచుందువేని ఆశక్తి అడిగిపోవచ్చును. అదే ప్రబలముగ నున్నప్పుడు నీవు ఎట్టిఆహారము తినినను ఏమియు చేయదు.

485. శరీరమునకు వేడిచేయనట్టియు, మనస్సునకు ఉద్రేకము కల్గించనట్టియు ఆహారమునే భుజింపవలయును.

486. ఎవడు సాత్విక శాకాహారమునే తినుచున్నను, బ్రహ్మప్రాప్తిని కోరుకొనడో, వానికి ఆసాత్వికాహారము సయితము గోమాంసమంత అనర్ధకరమేయగును. ఎవడు గోమాంసము తినుచునుకూడ బ్రహ్మప్రాప్తిని కాంక్షించునో వానికి ఆగోమాంసము సయితము దేవతలారగించు అమృతమువంటిది కాగలదు.

487. శ్రాద్ధసమయములందిడు భోజనముల స్వీకరింపకుము. అట్టితిండి భక్తివిశ్వాసముల నాశముచేయును. ఇతరులచేత హోమాదులచేయించి జీవించుపురోహితుని యింటనుభోజనము చేయతగదు.

488. ఆహారవిషయములో ఏదిదొఱకిన దానినే తిన దగదా?

పరమహంస - అది వానివాని ఆధ్యాత్మికదశను అనుసరించియుండును. జ్ఞానమార్గమున దానివలని హానియుండదు. జ్ఞాని ఆహారమును భుజించునప్పుడు, దానిని అతడు కుండలినీ అగ్నియందు హుతముచేయును. భక్తునివిషయమో వేఱు. భక్తుడు తనయిష్టదైవతమునకు నివేదన చేయుటకు అర్హ మగు పవిత్రాహారమును మాత్రమే ఆరగించవలయును. మాంసా