పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23వ అధ్యాయము.

ఆహారనీమము - ఆధ్యాత్మజీవనము.

483. పగలు తృప్తిగ భుజించుము; కాని రాత్రికాలమున తేలికగ కొలదిగ భుజింపుము.

484. విద్యార్ధియొకడు భగవాన్ శ్రీరామకృష్ణులవారిని "ఒకే బ్రహ్మము సర్వజీవులందును వసించును గాన ఎవనిచేతి, ఆహారము తినినను హానియేమి?" అని ప్రశ్నించెను. నీవు బ్రాహ్మణుడవాయని యడుగగా ఆవిద్యార్ధి అవునని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట పరమహంసులవారు "అందువలననే నీవు నన్నిట్లడగినావు. నీవు ఒకనిప్పుపుల్లను వెలిగించి దానిపైన యిన్ని ఎండుకట్టెలనే పడవేతువనుకొనుము. ఏమగును?" అని యడిగిరి.

విద్యార్ధి:- ఆప్రోగుచే కప్పిపెట్టబడి, నిప్పు ఆరిపోవును.

పరమహంస:- కార్చిచ్చుమండుచుండగా, దానిలో పచ్చి అరటిబొదెలను చాలగ తెచ్చిపడవేతువు అనుకొనుము అవి ఎమగును?

విద్యార్థి:- ఒక్క క్షణములో అవి భస్మమైపోవును.

పరమహంస:- ఆవిధముననే నీయందలి ఆధ్యాత్మికశక్తి కొలదిపాటిగనున్నప్పుడు, విచక్షణలేకుండ ఎవడిచ్చిన