పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

161

22వ అధ్యాయము.

477. ఒకసారి గురుదేవుడు తన శిష్యులలో నొకనిని వేడుకగా యిట్లు ప్రశ్నించెను? "సరేగాని, నాయందు అభిమానమున్నట్లు నీకు కాన్పించుచున్నదా? నాకు అభిమానమేమైన కలదా?"

శిష్యుడిటులనెను. "అవును, కొంచెమున్నది. ఆ కొంచెము నిలిచియుండుట ఎందుకొఱకనగా; (1) శరీర రక్షణకొఱకు, (2) భగవద్భక్తి సాధననిమిత్తము, (3) భక్తులసాంగత్యమునకూడియుండు యిచ్ఛవలన, (4) అన్యులకు సుబోధగఱపుకోరికను బట్టియును. అయిననుకూడ మీ రెంతయో ప్రాధేయపడిన యనంతరము అటుల నిలుపుకొనియుందురు. మీ ఆత్మయొక్క సహజదశ "సమాధియే" యని అభివర్ణింపనగును అని నాభావము. కాబట్టి మీకుగల అభిమానము మీరు ప్రత్యేకముగ ఉద్యమించి చేసిప్రార్ధనాఫలమని చెప్పితిని.

గురువు:- అవునుకాని ఈ జీవుని నిలిపియుంచుకొనునది నేనుకాదు. అటులచేసినది నాజగజ్జనని; నాప్రార్ధనను అంగీకరించు య్ధికారమంతయు నాదివ్యమాతదే.

478. భగవద్దర్శనముచేసినవాడే నిజమగుజ్ఞాని. అతడు పసిబాలునితీరున నగును. బాలుడుతనదగు వ్యక్తిత్వముగల వాడుగనే తోచును. కాని వాని వ్యక్తిత్వము చూపులకు మాత్రమే; సత్యముకాదు. పెద్దవారలవ్యక్తి భావముతో పోల్చిన యెడల పసివారల వ్యక్తిత్వము శూన్యమైతోచును