పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159

22వ అధ్యాయము.

పుకొనిరని తెలియుచున్నది. పారమార్ధిక మహత్తత్వమును యితరులకు బోధించునిమిత్తము వారటుల చేసియుండిరి.

473. తగులబడిన త్రాడునకు పూర్వపుఆకారము నిలిచి యున్నను; దేనినేని కట్టివేయుటకు పనికిరాని విధమున, బ్రహ్మ జ్ఞానాగ్నిచేత దగ్ధమైన "అహం" కారముండును.

474. కొబ్బరిమట్ట పడిపోవునప్పుడు చెట్టుమీదనొకమచ్చనునిలిపి పోవును. దీనినిబట్టి ఆతావున ఒకమట్టయుండెడి దని మనకు తెలియవచ్చును. అటులనే బ్రహ్మవే తలకు క్రోధాది ఉద్రేకములు కృశించి నశించిన చిహ్నములు మాత్రము నిలుచును. అట్టివారి స్వభావము పసివానినైజమును బోలియుండును, పసివానినైజమున సత్వరజ స్తమో గుణములు బలపడియుండని కారణమున అతడు ఒకదానియందు ఆసక్తినిపొందునటులనే దానిని విడిచివేయును: ఒక చిన్నపిల్లవాని కడ చాలవిలువగల వస్త్రముండగా "నేను దీనిని ఎవరికిని యియ్యను. యిది మానాయనకొనిపెట్టినాడు." అని పట్టుదలతో మొదటచెప్పిననుకూడ, దమ్మిడీ ఖరీదుచెయ్యని బొమ్మనిచ్చి ఆవస్త్రమును నీవు సంగ్రహింప గలుదువు. పసివానిదృష్టిలో ప్రతిది సమానమే. ఉత్తమాధమములను భేద భావములేదు. కులభేదముల పాటింపడు. వానితల్లి యింకొకని చూపి "వాడునీఅన్నే" అనిచెప్పినచాలును, ఆతడుకడజాతివాడైనను సరియే. ఒక్కకంచములో వానితోడ తిండితినుట కొడంబడును. వాని ద్వేషగుణము, శుచి, అశుచి అనుభావములుసయితముయుండవు.