పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

158

నున్నాను." ఈభావము స్థిరపడినయెడల, నరుడు తనది అనుకొనుటకేమియు మిగిలియుండదు.

471. ఉత్తమసమాధియను, సప్తమభూమికను పొంది బ్రహ్మభావమున లయముగాంచిన కొన్ని జీవాత్మలు మానవ లోకమునకు మేలుచేయ కరుణగలవారై తమ ఆత్మోన్నతిని నుండి దిగివత్తురు. వారు విద్యాహంకారమును అనగా ఉత్తమాత్మ భావనను నిలుపుకొనియే యుందురు. కాని ఈ "అహం"కారము ఉన్నదనుమాటమాత్రమేగాని నీటిమీద గీసినగీతను బోలియుండును.

472. హనుమంతునకు భగవంతుని సాకార నిరాకార స్వరూపముల రెండును గ్రహించుభాగ్యము లభించినది. అయినను ఆతడు భగవత్సేవకుడను "అహం" కారమును నిలుపుకొనియెను. నారద, సనకసనంద, సనత్కుమారుడును అటులనే నిలుపుకొనగల్గిరి.

(ఈసందర్భమున, నారదుడు మున్నగువారు భక్తులు మాత్రమేనా, జ్ఞానులుకూడనా, అను ప్రశ్న బయలుదేరినది. శ్రీరామకృష్ణపరమహంసులవారిట్లనిరి.)

(నారదాదులు బ్రహ్మజ్ఞానమును పడసినవారే. అయినను మర్మఱధ్వనులతో ప్రవహించు సెలయేరులరీతిని వారలు భాగవతస్తోత్రముల గానము గావించిరి; పరబ్రహ్మమును, తామును వేఱను స్ఫృహను కలుగజేయు లీలామాత్రపువ్యక్తిత్వమును అనగావిద్యాహంకారమునువారునిలు