పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

156

కొంతకాలమునకు అతడు రామానినాడు; వానిసంగతి యేమయ్యెనో మాకు తెలియలేదు. ఒకనాడు మేము కొన్నానగరము బోటెక్కిపోతిమి. మేము పడవదిగుచుండగా గంగానదిగట్టునకూర్చుండియున్న ఆబ్రాహ్మణుని కాంచితిమి. నదిపై నుండివచ్చు నిర్మలవాయువులు ననుభవించుచు దొరవలె కూర్చుండి యుండెను. నన్నుచూడగనే అనుగ్రహసూచనగా "ఓహో ఠాకూరూ! క్షేమమా?" అనిపలుకరించినాడు. వాని కంఠస్వరమున మార్పునుగనిపట్టి హృదయునితో నేనిట్లంటిని: హృదయా? వీనికేదియో సంపద చేజిక్కి యుండును. వీనిలో యెంతమార్పుచూపట్టుచున్నదో గ్రహించితివా?" అంతట హృదయుడు పకపకనవ్వసాగినాడు.

465. గర్వపడుట మహాధఃపతనము. కాకినిచూడుము; అదితానెంతయో బుద్ధిశాలిననుకొనును. అదెన్నడును వలలో చిక్కదు. ఏమాత్రము అపాయకారణముచూపట్టినను తప్పించుకొనిపోవును. కడునేర్పుతోదొంగిలించి మేతనుసంపాదించుకొనును. కాని పాపమాజంతువునకు అశుద్ధముతినక తప్పదయ్యె. అతిగా తెలివియున్నందుకు, అనగా నీచపు చమత్కారమున్నందుకు ఫలమిటులనుండును.

466. దంభము బూడిదప్రోవువంటిది. దానిమీద నీరుపడినతోడనే ఎండిపోవును. దంభముతో ఉబ్బిపోవువాని హృదయమున ప్రార్ధనలు ధ్యానములు ఫలప్రదములు కాజాలవు.

467. రెండుసందర్భములందు భగవంతుడు నవ్వునట!