పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

157

22వ అధ్యాయము.

ఒకటి:- జబ్బుముదిరియొకడుచావనున్నప్పుడువైద్యుడు వచ్చి, వానితల్లితో "ఎందుకమ్మా! ఆతురపాటునకుకారణమేలేదు. నీకొడుకుప్రాణముసంరక్షించుటకు నాదిభారము" అని పలుకుసమయమున;

రెండది:- ఇద్దఱుసోదరులుచేరి భూమినిపంచుకొన నెంచి వారుకొలపగ్గములను చేబూని, పొలముమీదికిపోయి "ఈ ప్రదేశమునాది, ఆ ప్రదేశమునీది" అనుకొనుసమయమునను!

468. కొలదిచదువుగలవారు గర్వముతో తబ్బిబ్బగుదురు. ఒకమానవుడు నాతోభగవంతునిగూర్చి తర్కముసాగించినాడు "అబ్బో! ఈవిషయములన్నియు నేనెఱిగినవే!" అనెను. నేనంతట "ఢిల్లికి పోయివచ్చినవాడు, తానటుల పోయివచ్చితినని చాటుచు దంభములు పలుకునా? ఘనుడు తానుఘనుడనని వాక్రుచ్చుచుండునా?" అంటిని.

469. అజీర్ణవాతరోగముగలవాడు పులుసు వస్తువులు తనకు హానికరములని బాగుగాఎఱుగును! కాని అభ్యాసవశమున, అట్టివికండ్లపడెనా వానికినోరూరును. అటులనే "నేను" "నాది" అను సంకల్పములను ఎంతగా అడంచివేయ ప్రయత్నించినను, కర్మక్షేత్రమున దిగగనే అపక్వపు "అహం"కారము తలవెళ్ళబెట్టుచునే యుండును.

470. సతతము నీవిటుల తలపోయుచుండుము; "ఈ సంసారవిషయములు నావికావు; అవి భగవంతునివి; నేను వానిదాసుడను. వాని కోరికలు చెల్లించుటకే నేనిక్కడ