పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20వ అధ్యాయము.

పారమార్ధిక సాధనయందలి

అవాంతరములు.

391. పిఱికితనము, ద్వేషము, భయము, --జ్యముచేయుపట్ల భగవంతుడు గోచరించడు

392. ప్రశ్న:- మనస్సు ఎట్టిదశయందున్నప్పుడు భగవత్సాక్షాత్కారము లభించును?

జవాబు:- మనస్సు ప్రశాంతముగ నున్నప్పుడు భగవంతుడు సాక్షాత్కరించును. మనోజలధిని వాంఛల నెడు గాడ్పులు కల్లోలపఱచుచో అందు దేవునిప్రతిబింబము గోచరించదు; భగవత్సాక్షాత్కారము అట్టిదశయందు అసంభవము.

393. పాపవిషయములందుచరించు మనస్సును మాలపల్లె యందు వసించు బ్రాహ్మణునికి పోల్చనగును; లేదా పెద్దనగరములలోని వేశ్యవాటియందు కాపురముండు సజ్జనునితో పోల్చదగును.

394. అనేకమంది మానవులు వినయము చూపనెంచి "నేను మురికిగుంటలలో నుండు వానపామువంటివాడనండి! అనుచుందురు, అటుల సదామననము చేయుచు నుండువారు కొంతకాలమునకు కీటకములమాదిరి పారమార్ధికత యందు క్షుద్రులగుదురు. హృదయమున నిరాశయుండ