పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

132

దానిని వేఱుచేసి, లోకవ్యవహారములందు నిలిపితిరా, కొలదికాలములోనె భక్తియంతయు పోయి పేదపడును. పావనభక్తివిశ్వాసములు నిరంతరము నీహృదయమును ఆవరించి యుండునటుల జేసితివాసదాయది పవిత్రభక్తిపూరితమైయుండి ప్రసన్నముగ నుండును.

389. సముద్రమున ముత్యములున్నవి; కాని వానిని తీయగోరు నరుడు ప్రాణాపాయమునకు వెఱువక నీటమునుగవలయును. ఒక్కసారి మునిగినంతనే ముత్యములు చేజిక్కిని యెడల సముద్రమున ముత్యములులేవని నిర్ణయించతగదు. మరలమరల మునిగి వెదకులాడినచో తుదకు కష్టము ఫలించును. ఈజగమున భగవంతుడుగలడు. ఆదేవుని కనుగొనుటలో నీతొలిప్రయత్నముఫల మొసగనియెడలనిరుత్సాహివి కాదగదు. పట్టువీడక పెక్కుసారులు పాటుపడుము. తుదిని నీకు వాని సాక్షాత్కారము లభించును.

390. జ్ఞానదానమును పూర్ణముగా నొక్కసారి చేయుటకు వలనుపడదు.