పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

134

తగదు. నిరాశయనునది పురోగమనమునకు ప్రబలశత్రువు. "మనుజుడు తాను మననము చేయురూపమునే పొందును."

395. దారపుకొనను రేగినపోగులున్నంతకాలమును యది సూదిలో దూరజాలని చందమున, నరునందు కోరికలు యేమాత్రమేని రేగుచుండు నంతకాలమును ఆతడు బ్రహ్మలోకమున ప్రవేశింప జాలడు.

396. కడుపునిండియున్నను అజీర్ణవాతముతో బాధపడుచున్ననుగూడ నరునికి మిఠాయిగాని, కమ్మని కూరగాని కంటబడగానే నోరూరును. ఒకనికి లోభగుణము యిసుమంతయు లేకపోవచ్చును. అతడు పవిత్రభావములు కలవాడై యుండవచ్చును. కాని ధనము కన్నులకగపడినప్పుడును, కామ్యార్ధములు చేరువలో నున్నప్పుడును, వానిమనస్సు పెరపెరలాడును సుమీ!

397. ఇతరులమంచిచెడ్డల విమర్శించుచు కాలముగడుపు వానిజీవనము వ్యర్ధముగావ్యయమై పోవును. యిట్లితరులజోలి పెట్టుకొని వ్యర్ధకాలయాపనచేయువానికి తనఆత్మను గురించిగాని, పరమాత్మను గురించిగాని చింతనచేయుటకు సమయము చిక్కదు.

398. పెద్దపెద్దధాన్యపుకొట్ల ద్వారములకడ పేలాలు మూటలుగల యెలుకబోనులు పెట్టుదురు. ఆపేలాలవాసనచేతలాగబడి యెలుకలు ధ్యాన్యపుగింజల రుచిచూడవిడిచి బోనులలోనికిపోవును. అందవి చిక్కుకొనిచచ్చును. జీవునిగతి