పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

128

లనే పిచ్చివాడవగుచు వచ్చితివి. యిప్పుడు తుదకునన్నుగాంచగల్గితివి" అని జగజ్జనని పలికెను.

376. పాలగిన్నెక్రింద నిప్పున్నంతకాలమును పాలు పొంగుచునేయుండును; కాని నిప్పును తీసినవెంటనే పాలుపొంగుట మానును. అటులనే క్రొత్తగ భక్తిసాధనలు పూనునతడు ఆసాధనలు సాగునంతవఱకే ఆవేశముతో పొంగిపడుచుండును.

377. కమ్మరివాని దాగలిమీద ఎటువంటి సమ్మెట దెబ్బలుతగులునో చూడుడు; అయినను ఆదాగలి చంచలింపదు. మానవులకును అట్టి ఓర్పు, స్థిరత అలవడవలయును.

378. ఓడలోని దిక్సూచీయంత్రమున ముల్లు ఉత్తరదిశను చూపుచుండునంతకాలమును, ఓడ దారిదప్పి అపాయముల జిక్కుపడునను భయముండదు. జీవననౌకకు దిక్సూచి యననగు నరుని మనస్సు పరబ్రహ్మమువంకకు తిరిగియుండి చలింపకుండునంతవరకును వాని కేయనర్థమును వాటిల్లదు.

379. కాళీఘట్టమునకు త్రోవలనేకములుకలవు. సంశయశర్మయనువాడు అచ్చటికి పోవలయునని తనయూరినుండి బయలుదేఱెను. త్రోవలో యతడు "నేను కాళీఘట్టము చేరుటకు మార్గమెద్ది?" అని ఒకమనుష్యుని అడిగినాడు. "ఇదిగో ఈత్రోవనుపొమ్ము" అని అతడుచెప్పినాడు. మరికొంత దూరముపోయి సంశయశర్మ వేఱొకని చూచి