పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19వ అధ్యాయము.

పారమార్థిక సాధనయందు దీక్ష.

373. గాలమువేసి పెద్దచేపను పట్టుకొనయత్నించువాడు ఎఱనుగ్రుచ్చిన గాలమును నీటిలోవేసి, మౌనముపూని చాలాకాలము శ్రద్ధతోవేచియుండునెడల చేపవచ్చి పట్టుపడును. అటులనేధ్యానాదుల సాగించుచు శ్రద్ధతోవేచియుండు భక్తుడు తుదిని భగవంతుని పట్టుకొనగలడు.

374. క్రొత్తగాపుట్టినదూడ తడబడుచు అనేక పర్యాయములు నిలువబోయి పడుచుండును; తుదిని స్థిరత చిక్కినిలువగల్గును. అటులనే క్రొత్తగాధ్యానాదిసాధనలు పూనువాడు చాలసారులు తొట్రుపడును. కానితుదను వానికి జయను సమకూడుదు.

375. భయావహమగు శివసాధనను పూని యిరువురు కాళీదేవిని ప్రత్యక్షము చేసికొనయత్నించిరట. ఒకడు అర్ధరాత్రమునకుచాలపూర్వమె ఆస్మశానమున కాన్పించసాగిన దృశ్యములగాంచి భీతిలిపోయినాడు. రెండవవాడు అర్ధరాత్రము దాటువఱకును ధైర్యముచిక్కబట్టి నిలచి దేవినిప్రసన్నముచేసికొనగలిగినాడు. అప్పుడతడు "జగజ్జననీ! ఈరెండవవాడు "పిచ్చివాడై పోయినాడు; ఎందుచేతనమ్మా?" అని అడుగగా పుత్రా! నీవును నీపూర్వజన్మలందు పెక్కుతడవలు యిటు