పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

129

19వ అధ్యాయము.

"కాళీఘట్టమునకు దగ్గిఱత్రోవ యిదేనా? అని ప్రశ్నించినాడు. ఆమనుష్యుడు "అబ్బే యిదికాదు. కొంచెము వెనుకకుపోయి, ఆఎడమచేతివైపుత్రోవను పొమ్ము" అనెను. అప్పుడు సంశయశర్మ ఆరెండవ త్రోవను కొంతవడిపోయి యింకొకనినికలుసుకొని వానిని త్రోవయడిగినాడు. అతడు మరియొక త్రోవను చూపినాడు. ఇటుల మరలమరల త్రోవలను మార్చుకొనుచుసంశయశర్మ పొద్దుక్రుంకువఱకును నడచినాడు కాని పయనమైనతావునుండి ఎంతయోదూరము పోలేకపోయెను. నిశ్చయముగా కాళీఘట్టము చేరనెంచువాడు ఎవడోఒకడుతెలిసినవాడుచెప్పు త్రోవననే అనుసరించవలయును. అటులనే భగవత్సాక్షాత్కారమును, పడయజూచువాడు ఒక్కగురువునే ఆశ్రయించి యుండవలెను.

380. ఈతనేర్వ తలపెట్టునతడు కొన్నిదినములు ప్రయత్నమును సాగించవలయును. ఒక్కదినము సాధన చేసినంతటనే సముద్రమున ఈదులాడు సాహసము నెవడును పూనరాదు. అటులనే నీవు బ్రహ్మసాగరమున ఈదులాడునెంచితివేని, నీవు కృతకృత్యుడవగుటకు పూర్వము, ఫలముచే జిక్కకున్నను చాలప్రయత్నముల చేయవలసియుందువు.

381. సంచిచిరిగికారిపోయి నలుదిశలునేలబడిన ఆవగింజలను ప్రోవుచేయుట చాలాకష్టము. అటులనే నరునిమనస్సు పలుతెరగుల లోక విషయములంబడిపోయినయెడల దానిని కూడదీసికొని ధ్యానమునందు ఏకాగ్రముచేయుట దుర్లభము.