పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

2

రొకటిగా ఆయావస్తువులను విడిచివేయుచు పోయి, తుదకు ధనపు పెట్టెను తాకగల్గును. వెంటనే ఇదిగో! ఇదే! అనుకొనును. అంతట వాని తడవులాట ముగియును. బ్రహ్మము కొఱకగు అన్వేషణము సరిగ యిటులనే జరుగును.

6. నిన్ను నీవు తెలిసికొంటివా, అంతట అహంకారమునకు భిన్నముగనుండు సర్వేశ్వరుని నీవెఱుంగ జాలుదవు. నా ఆత్మయేది? నాఆత్మ అనగా నాచేయియా, నాపాదమా, మాంసకండరమా, రక్తమా, స్నాయువులా, గాఢముగ విచారణ సలుపుము. 'అహం' అనదగిన వస్తువేలేదని నీకు తెలియవచ్చును. ఉల్లిపాయపొఱలను వలిచిన కొలదిని పొఱలు వచ్చుచునేయుండును. తుదకు లోపల గుజ్జేమియు కాన్పింపదు. అదేతీరున 'అహం' అను దానిని పృథక్కరణము చేయుచు పోగాపోగా 'నేను' అని చెప్పదగిన స్థిరపదార్థము ఏదియు కాన్పింపదు. ఇట్లు ;అహం' అనగనేమో పరిశోధన చేయుచుపోగా అట్టిది యేదియులేక సర్వాధార వస్తువు భగవంతుడు మాత్రమే కలడని తెలియవచ్చును. జీవత్వము తొలగునప్పుడు శివత్వము ప్రాప్తించును.

7. కేవల జ్ఞానము అన్నను కేవలభక్తి యన్నన్ను ఒక్కటియే; భేదములేదు.

8. మనలోనున్న మూలాహంకారమును జయించుటెట్లు? పువ్వులోని పిందె పెద్దదయినప్పుడు పూరెబ్బలు వాటి