పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావలి

1వ అధ్యాయము.

ఆత్మజ్ఞానము

1. జ్ఞానము ఏకత్వమునకు దారిజూపును; అజ్ఞానము భిన్నత్వమునకు త్రోవజూపును.

2. కుబుసమును, పామునువేఱైనట్లు శరీరమును ఆత్మయును వేఱు.

3. పాదరసము (కళాయి) వేసిన అద్దమునందు మనముఖము ప్రతిబింబించి స్పష్టముగ గోచరించుతీరున , బ్రహ్మచర్యమువలన తనబలమును, పవిత్రతను సంరక్షించుకొనిన, నరుని హృదయమునందు సర్వేశ్వరుని ప్రతిబింబము దివ్యముగ గోచరించును.

4. గురువనియు, శిష్యుడనియు, ఇట్టి సంబంధమును పాటింపజాలని పవిత్రావస్థ విచిత్రమైనది. దేనిని సిద్ధింపజేసికొనిన పిమ్మట గురుశిష్య భేదము నిలువజాలదో అట్టిబ్రహ్మజ్ఞానము విచిత్రమైనది సుమీ !

5. దొంగవాడు చీకటిగదిలో ప్రవేశించి అచ్చటి వస్తువులను తడవి చూచును. బహుశః ఒకబల్లపై చేతినిడును. 'ఇది కాదు ' అని ముందుకుపోవును పిమ్మట ఇంకొక వస్తువు మీద చేయివేయును, అది కుర్చీకావచ్చును. అంతట 'ఇదికాదు' అని దాటిపోవును. ఇట్లొకదానితరువాత