పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

1 వ అధ్యాయము.

యంతట అవియేరాలిపోవును. అటువలెనే నీలోని శివత్వము వికశించినప్పుడు, నరజీవసామాన్యములగు క్షుద్రభావములు వానియంతట అవియె తొలగిపోవును.

9. శ్రీపరమహంసులవారు తమ హృదయమువంక జూపుచు యిట్లు అనెడివారు; "ఇక్కడ దేవుడున్నాడనువానికి అక్కడను (అనగా బాహ్యప్రపంచమునను) దేవుడున్నట్టే. తనలోపలదేవుని కాంచలేనివానికి వానివెలుపలను దేవుడు కాన్పించడు. తన జీవాత్మయనెడు దేవాలయము నందు దేవుని చూడగలవానికి విశ్వమను దేవాలయము నందును దేవుడు కాన్పించును.

10. నరశరీరము కుండవంటిది; ; మనస్సు, బుద్ధి ఇంద్రియములు, అనునవి దానిలో నిండిననీరు, బియ్యము, ఆలుగడ్డల వంటివి. నీరు, బియ్యుము, ఆలుగడ్డలు గల కుండను పొయ్యిమీద పెట్టినప్పుడు, ఈపదార్ధము లన్నియు వేడెక్కును. ఆ ఉష్ణము యనునది ఆకుండ, నీరు, బియ్యము, ఆలుదుంప అనువానిలో దేనికినిచెందినది కాకపోయినను వానిని తాకినంతనే చేయి కాలునుగదా. అదేవిధముగా మసస్సు, బుద్ధి, ఇంద్రియములు అనునవి తమ తమ పనులు చేయుటకు ఆధారమగునది బ్రహ్మముయొక్క శక్తియే. ఆశక్తితొలగునా ఇవన్నియు పనిచేయుట మానును.

11. పరమాద్వైత జ్ఞానమును జేబులో పెట్టుకొని నీయిష్టము వచ్చినట్లు వర్తింపుము, అప్పుడు నీలోనుండి కీడేమియు వెలువడనే వెలువడదు.