పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97

12వ అధ్యాయము.

289. ఈతనువు తుచ్ఛమును అశాశ్వతము నైన పక్షమున పుణ్యపురుషులును భక్తులును దీనిని జాగ్రత్తగా సంరక్షింతురేల? వట్టిపెట్టెను ఎవడును కాపలా కాచబోడు. విలువగలనగలు, బంగారము, అమూల్యవస్తువులు నిండియున్న పెట్టెను ఎల్లరును రక్షణచేతురు. ఏతనువున దివ్యాత్మ వాసముచేయుచుండునో, దానిని పుణ్యాత్ములు సంరంక్షించకవీలులేదు. మన శరీరములన్నియు భగవంతుని ధనకోశములే.

290. లోతులేనిమడుగులోని తేటనీరు త్రాగదలచువాడు దానిని ఎంతమాత్రము కదల్చకుండ, పైపైనీటిని నెమ్మదిగా తీసికొని త్రాగవలయును. దానిని కదిలించేయెడల అడుగు బురదపైకివచ్చి నీటినంతను చెఱచును. నీవు పవిత్రుడవుగా నుండకోరితివేని నిశ్చలవిశ్వాసముగలిగి నెమ్మదిగా నీభక్తి సాధనను సాగించుకొమ్ము. శాస్త్రచర్చలలోనికిని తర్కవాదములలోనికిని దిగి నీసామార్ధ్యమును వృధాచేసికొనకుము అటులకాదేని అల్పమగునీమెదడు కలవరమున చిక్కిపోవును.

291. మనము భగవంతునిగూర్చి బిగ్గఱగా ప్రార్ధనలు చేయవలయునా! నీయిష్టమువచ్చినతీరున వానిని ప్రార్ధించుము. ఆయన నిశ్చయముగా నిన్నాలకించును. ఆయన చిన్న చీమకాలు చప్పుడును సయితము వినగలడు.

292. చిన్న మొక్కయుండినచోమేకలు, పశువులు, మేయకుండను పిల్లవాండ్రుపాడుచేయకుండను కాపాడుటకుచుట్టుకంచెవేయవలయును. ఆమొక్క పెద్ద చెట్టైనపిమ్మటమేకలమందగాని, ఆవుల