పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

98

గుంపుగానినిరపాయముగదానికొమ్మలనీడవిశ్రమించవచ్చును. దాని ఆకులు పండ్లుతిని పొట్టలునింపుకొననువచ్చును. అట్లే నీయందుకొద్దిదగుభక్తిమాత్రమే యున్నప్పుడు దుష్టసాంగత్యమును, సంసారవ్యావృత్తియు దానినిచెడగొట్టకుండసంరక్షించవలయును. కాని, నీభక్తిదృఢపడినపిమ్మట, సంసారవ్యావృత్తిగాని దుష్టవాంఛలుగాని, నీపవిత్రసమక్షమునుదాపరించ సాహసించవు. దివ్యమౌనీసాంగత్యమహిమచేత పలువురు దుర్మార్గులు దైవభక్తులుగ మారగలరు.

293. "నేను మీకొసగుఉత్తరువులకు పూర్ణముగా విధేయులై వర్తింపగలరా? నేనుమీకు తెలుపుదానిలో ఒకవీసమైనను నిర్వహించితిరేని మీరుతప్పక తరించెదరని నేనుదృఢముగా చెప్పుచున్నాను." అనిభగవాన్‌శ్రీరామకృష్ణపరమహంసులవారు చెప్పుచుండెడివారు.

294. కంబళిపురుగు స్వయముగా తాను అల్లుకొనినగూటిలోనే బంధనమున చిక్కుకొనును. అటులనే లౌకికాత్ముడు తనకోర్కెలవలలోనే తగులువడును. కాని ఆకంబళిపురుగే మెఱుగులుగ్రక్కు చక్కని సీతాకోకపురుగుగా పరిణమించినప్పుడు, తనగూటినిభేదించుకొని యెగిరివచ్చి సూర్యరశ్మిని, వాయువును, ఆనందముగా యనుభవించును. అటులనే లౌకిక జీవియు వివేకము వైరాగ్యము అనురెక్కలతో మాయాబంధముల తెంచుకొని విడివడగలడు.

295. మనస్సును ఏకాగ్రముచేయుటకు, దీపముపైని నిలుపుట అతిసులభమైనమార్గము. దానిమధ్యనుండు సువినీలభా