పుట:Shodashakumaara-charitramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

127


వ.

ఆతరుణీరత్నంబు కోరికి పారంబు నొందించుతలంపున నమ్మఱునాఁటియర్ధరాత్రసమయంబున నీసభుండు ఖడ్గకసహాయుండై పరేతసదనంబున కరిగి తదంతరంబున నల్లనల్లన నసియించుచు.

49


క.

వినుతాహారంబులఁ గ్రొ
వ్వెనయం గల మనుజమాంస మిదె యమ్మఁగ వ
చ్చినవాఁడఁ గోసి యిచ్చెదఁ
గొనవలసినవారు వచ్చి కొనరో యనినన్.

50


క.

అందియ గోల్పడిపోయిన
ముందటి దానవి సఖీసమూహముతో నిం
పొంద విని చేరఁగాఁ జని
మందరనగధీరు నాకొమరుఁ గని వేడ్కన్.

51


వ.

అన్నెలవునకు వినోదార్థంబు వచ్చి యొక్కయెడనున్న నాకడకుం బఱతెంచి.

52


క.

మారాకారుఁడు మిక్కిలి
శూరుఁడు నగువాని కిత్తు సుత నం దెపుడున్
మారాకారుఁడు మిక్కిలి
శూరుఁడు నగువాఁడు గలిగెఁ జూపెద రమ్మా.

53


వ.

ఏను నిన్న నతనిపౌరుషం బంతయుం జూచితి నని తద్వృత్తాంతంబు వివరించి నేఁడును నన్ను బ్రమయించి పట్టి తోడియందియం బుచ్చుకొని పోవుతలంపున వచ్చి తిరుగుచున్నవాఁ డని చెప్పిన నతనిం జేరనరిగి.

54


శా.

భూతప్రేతపిశాచరాక్షసగణస్ఫూర్తిన్ జనశ్రేణికిన్
భీతిం బర్వగఁజేయు నిన్నెలవున న్భీమాంధకారంబున