పుట:Shodashakumaara-charitramu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

షోడశకుమారచరిత్రము


న్వీతాతంకత నీవు ద్రిమ్మరుటకున్ డెందంబున న్మెచ్చి సం
ప్రీతిం బొందితి వేఁడు మిప్పుడు మనోభీష్టంబుల న్నావుడున్.

55


గీ.

నిన్న నొకయందె చేకుఱె నిన్నెలవున
నాకు నీతోడియందియకై కడంగి
యరుగుదెంచితి నిచటి కయ్యందె నాకు
నిచ్చుట యభీష్ట మనవుడు నిచ్చ నలరి.

56


క.

వెనుకదెస నున్నదానవిఁ
గనుఁగొనుటయు నందెవుచ్చి క్రమ్మఱ నాకి
చ్చిన నేనాతనికిఁ బ్రియం
బెనయంగా నిచ్చి మైత్రి యెసకంబెసఁగన్.

57


వ.

ఏ నడుగం దనబాల్యంబు మొదలుకొని నిన్నుఁ గన్నది తుదిగా నిజవృత్తాంతం బంతయు నెఱింగించిన నీ చెలిమాటలకు మోదించి మమ్ముఁ జూచి యరుగుదు గాని రమ్మని మత్పురంబునకుం దోడ్కొనిపోయి మదీయంబు లగుసకలసంపద్విభవంబులుం జూపి వివిధసంభావనంబు లొనరించి.

58


చ.

అవిరళకాంతికాంతనవయౌవనరూపవిలాసభాసురన్
యువతీలలామ నాతనయ నుత్సవమారఁగఁ బెండ్లి చేసిన
న్భువనమనోజ్ఞభోగములఁ బొందుచుఁ గొన్నిదినంబు లుండి భూ
ధవసుతపాలి కేగి ప్రమదంబున నందియ యిచ్చి మచ్చికన్.

59


వ.

అచ్చట నచ్చపలనయన నిష్టోపభోగంబులం దేల్చి క్రమ్మఱ మత్పురంబున కరుదెంచి మిమ్ముం బొడగను నుపాయంబు చింతింపుచుండ నొక్కనాడు శుక్రశిష్యుండు మహామతి యనువిప్రుండు మాసదనంబున కరుగుదెంచిన నితండు త్రికాల