పుట:Shodashakumaara-charitramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

షోడశకుమారచరిత్రము


బలుమాఱును నెలుఁగడరఁగఁ
బలబించుచు నతనిఁ గని ప్రబలదైన్యమునన్.

43


మ.

నెఱిలే కోర్వనివారిమాటలకునై నేఁ డారెకు ల్మత్పతిం
గొఱతం బెట్టిరి దప్పిఁ దూలెడుఁ గడుం గొ ఱ్ఱందమిం జాలఁ ద
త్తఱముం బొందెద నీజలం బొసఁగు చందం బెద్ది నాకంచు బ
ల్మఱు దుఃఖించుచు వేఁడినం గరుణ యాత్మం బర్వ ధైర్యంబునన్.

44


గీ.

నాభుజం బెక్కి నీ ప్రాణనాయకునకు
నీ రొసంగు మంచు నాకొఱ్ఱు చేర నరిగి
యాతం డెక్కించుకొన మెలపడర నెక్కి
మూఁపులందుఁ బదంబులు మోపి నిలిచి.

45


గీ.

కొఱితిపై నున్న చోరుని విఱిచినమలఁ
బలలఖండంబు లిలమీఁదఁ బడినఁ జూచి
వెఱక రక్కసిగా మదినెఱిఁగి యచటఁ
గదలిపోవక నిశ్చలహృదయుఁ డగుచు.

46


చ.

సురుచిరదివ్యరత్నపరిశోభితనూపురరమ్య మైన త
చ్చరణము నంటఁబట్టుటయం జయ్యనఁ దానది యూడిపోవుడుం
గరములఁ దత్పదాంగదము గ్రక్కునఁ జిక్కినఁ జూచి మెచ్చులం
బొరయుచు వేడ్క బట్టుకొని పోయి నరేంద్రతనూజ కిచ్చినన్.

47


క.

మనుజులకు బ్రాఁతియగు న
య్యనుపమభూషణముఁ జూచి యయ్యింతి ప్రియం
బున దీనితోడియందియ
యును దొరకొనుభాగ్య మబ్బునొకొ నా కనినన్.

48