పుట:Shodashakumaara-charitramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

125


చ.

సమయము గాదు నా కిపుడు శాశ్వతభోగము లంద మామహీ
రమణుని మిత్రవర్గము ధరాస్థలి నారసి కాంచి పిమ్మట
స్సముచితవృత్తి నీదువరసందనఁ బెండిలి యై యభీష్టభో
గముల సుఖంతు నే ననినఁ గ్రమ్మజ నాతఁడు వల్కువేడుకన్.

38


క.

నానాదేశములకుఁ దగు
మానిసులం బనిచి సఖిసమాజంబును మీ
మానవపతి నరయించెద
దీనత మైఁ గుంది నీకుఁ దిరుగఁగనేలా.

39


వ.

అని సమ్మతంబుగాఁ బలికి పలికినయట్ల వెరవరు లగు భృత్యుల నానాదేశంబులకుం నరయం బనిచి యొక్క శుభలగ్నఁబున నత్యంతవిభవంబునం దన కన్నియ వివాహం బొనరించి సకలసంపదలు నిచ్చిన నచ్చెలువతో నభిమతక్రీడావినోదంబులం దేలుచుండి యొక్కనాఁటి నిశాసమయంబునం దత్పురోపకంఠంబున నొక్కయార్తనాదంబు వీతెంచిన.

40


క.

దృఢముష్టి వెడలె ఖడ్గము
దృఢముష్టి నమర్చి దాని తెఱఁ గెఱుఁగుటకై
దృఢముగ బలవితరణపరి
వృఢుఁ డార్తులఁ గావ నెట్టివేళలఁ గడఁగున్.

41


వ.

ఇట్లు వెడలి చని యయ్యార్తనాదంబు చక్కటికి నరుగు నప్పుడు.

42


క.

అలఘుతరదివ్యభూషలు
వెలుఁగంగా నోర్తు హృదయ వేదన దోఁపం